KMR: దోమకొండకి చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సన్నిహితుడు ఎండీ సలీం (50) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సలీం 2018లో మండల పరిషత్ కో-ఆప్షన్ మెంబర్గా పనిచేశారు.