KNR: జమ్మికుంట పట్టణంలోని దుర్గా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ నివాస గృహంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. రెండు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.