BDK: తెలంగాణ మైనారిటీ గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఐదవ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ముస్లిం, మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చని తెలిపారు.