TG: ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశలో ఒక చరిత్రాత్మక అడుగుగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను దావోస్‌లో అధికారికంగా ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో భాగంగా ఈ నెల 20న దావోస్‌లోని మౌంటెన్ ప్లాజాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.