AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో దారుణం జరిగింది. కోడిపందాల బరి దగ్గర డబ్బులు దొంగిలించారనే అనుమానంతో, నిర్వాహకులు కూలీలను బట్టలూడదీసి తాళ్లతో కట్టేసి కొట్టారు. డబ్బుల లెక్కల్లో తేడా రావడంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని వీడియో తీయడం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.