ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల మార్పుపై చర్చించేందుకు ఐసీసీ బృందం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లనుంది. అయితే, ఈ బృందంలోని ఓ భారతీయ అధికారికి వీసా జారీ చేసేందుకు బంగ్లాదేశ్ నిరాకరించినట్లు సమాచారం. భద్రతా కారణాలతో వేదికలు మార్చాలన్న డిమాండ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ చర్యకు పాల్పడటం అటు క్రికెట్, ఇటు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.