WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని పాత మున్సిపాలిటీ భవనాన్ని ఇవాళ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతో కలిసి ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పరిశీలించారు. MLA నాగరాజు మాట్లాడుతూ.. తాత్కాలికంగా ఈ భవనంలో కోర్టు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలకు స్థానికంగానే న్యాయ సేవలు అందేలా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. DCC అధ్యక్షుడు అయూబ్ తదితరులు ఉన్నారు.