KMM: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్ వార్డులను లాటరీ పద్ధతిలో ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. నిన్న కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీల రిజర్వేషన్ ప్రక్రియను నిర్వహించారు. నిబంధనల ప్రకారం మహిళలకు వార్డులను కేటాయించారు.