CTR: సోమలలోని ఉన్నత పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. సంక్రాంతి సెలవులు కావడంతో పలువురు మద్యం సేవించి బాటిల్లను అక్కడే వదిలి వేస్తున్నారు. తరగతి గదుల ముందు ఉంచిన బాటిల్స్‌ను స్థానికులు గమనించి ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబులు పాఠశాలలోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.