KMM: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో ఆదివారం తెల్లవారుజామున ఎదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో పార్టీ నాయకులు నండ్ర ప్రసాద్, వడ్లమూడి నాగేశ్వరరావు, కారుమంచి గురవయ్యలను అక్రమంగా అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.