SRCL: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సతీమణి, బీర్ల ఫౌండేషన్ ఛైర్మన్ అనిత దర్శించుకున్నారు. ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.