వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాన్ట్రీ క్రేన్ కొనుగోలు కోసం 3.50కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. త్వరలో టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్టు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద మే నెల చివరి వారంలో ప్రాజెక్టు గేట్ల వద్ద వైర్లు తెగిపోవదంతో ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే.