హీరో శర్వానంద్‌తో నటి ఆషిక రంగనాథన్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్లతో శర్వా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆషిక కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు, ఫస్ట్ షెడ్యూల్లో శర్వాపై ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.