W.G: కామవరపుకోటలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోనేరు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి 29వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. టీడీపీ పేదల పార్టీ అని, కూడు, గూడు, గుడ్డ సిద్ధాంతంపై 43 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.