BPT: బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బాపట్ల పట్టణంలోని ప్రజలు పురపాలక సంఘం నుంచి సేవల్లో కలిగే అంతరాయాలపై నేరుగా అర్జీలను అందించవచ్చన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.