HNK: హసన్పర్తి (M)జయగిరి గ్రామానికి చెందిన విఘ్నేశ్ (17) అనే ఇంటర్ విద్యార్థి తండ్రి మందలించాడన్న కారణంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. HNKలోని రామారంలోని ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్న విఘ్నేశ్ కాలేజీకి వెళ్లకుండా చెడు తిరుగుడు చేస్తుండడంతో తండ్రి రమేశ్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన విఘ్నేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.