కృష్ణా: తాడంకి గ్రామం పరిధిలోని బుల్లీ వైన్స్ సమీపంలో బీరు సీసాలతో జరిగిన భీకర దాడి ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, రక్తపు మడుగులో పడిపోయిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.