RR: న్యూ నాగోల్ మెయిన్ రోడ్డులో స్టార్మ్ వాటర్ పైప్ లైన్ పనులను జలమండలి డీజీఎం రవీందర్ వర్మతో కలిసి కార్పోరేటర్ నాయికోటి పవన్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధంగా నియంత్రించాలని, ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్యలు తొలగి, ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.