AP: దావోస్ 2026కి ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలపడమే లక్ష్యమన్నారు. 90వ దశకంలోనే చంద్రబాబు.. భారత్కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరని గుర్తుచేశారు. దావోస్ అనేది కేవలం ఎంఓయూలపై సంతకాలు చేసే వేదిక మాత్రమే కాదని, వ్యాపారం, సాంకేతికత ఏ దిశగా సాగుతున్నాయో తెలుసుకునే ప్రపంచస్థాయి ఆలోచనా వేదిక అని గుర్తుచేశారు.