ప్రకాశం: కొనకనమిట్ల మండలంలోని గార్లదిన్నె గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ ఉదయం 9 గంటల అయిన తెరవలేదని గ్రామస్తులు చెబుతున్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. సమయం 10 అవుతున్న తలుపులు తెరవలేదని సిబ్బంది అందుబాటులో లేరని అధికారులు స్పందించి సిబ్బంది అందుబాటులో ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారు.