ADB: కేస్లాపూర్ నాగోబా జాతర ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 350 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.