ATP: కుందుర్పి మండల కేంద్రంలో అడవులకు నిప్పు పెడితే శాకాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ మల్లికార్జున, సూర్యనారాయణ మండల ప్రజలకు హెచ్చరిస్తూ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తే చర్యలు తప్పవన్నారు. అడవులకు నిప్పు పెడితే పర్యావరణానికి నష్టం జరుగుతుందని వారు తెలిపారు.