గుంటూరు: NTR ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండును పీపీపీ విధానంలో సమీకృత బస్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. ఆమోదం లభిస్తే రూ.60 కోట్లతో డీఎఫ్–బీవోటీ విధానంలో పనులు చేపడతారు. పెరిగిన ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు పెంచనున్నారు. తర్వాత ఏజెన్సీ నిర్వహణ చూస్తారు.