NRML: జిల్లా పరిధిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రము చించోలి-బిలో టైలరింగ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, బ్యూటీషియన్ విభాగాల్లో మహిళలకు ఉచిత శిక్షణలు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. 15 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9848255529 సంప్రదించాలని సూచించారు.