BDK: కొత్తగూడెం సంత, పట్టణ ప్రాంతం సహా అన్నపురెడ్డిపల్లి మండలంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ధృవీకరణ లేని యంత్రాలు వాడుతున్న 12 మాంసం, చేపల దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా అధికారి కె. మనోహర్ తెలిపారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.