KRNL: మద్దికేర పోలీస్ స్టేషన్ పరిధిలోని FIR వివరాలు ఇకపై వాట్సాప్ ద్వారా పొందవచ్చని ఎస్సై హరిత ఆదివారం తెలిపారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపి, మెనూలో పోలీస్ విభాగాన్ని ఎంచుకుని కేస్ నంబర్ నమోదు చేస్తే ఉచితంగా FIR కాపీ లభిస్తుందన్నారు. దీంతో ప్రజలు స్టేషన్‌కు తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలు పొందవచ్చని చెప్పారు.