KDP: బద్వేలు రూరల్ పరిధిలో జరిగిన చిన్న గుర్రయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూ.20 లక్షల అప్పు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడన్న కక్షతో, స్వంత అన్నలైన టీచర్ గుర్రయ్య, నడిపి గుర్రయ్య పథకం ప్రకారం సుత్తులతో కొట్టి తమ్ముడిని హత్య చేశారని SP నచికేత్ వెల్లడించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు వాడిన ఆయుధాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.