NDK: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం నాయకులతో కలిసి నర్సాపూర్ పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో BRS అభ్యర్థులను గెలిపించాలన్నారు.