TPT: మల్లయ్యపల్లెలో జల్లికట్టు నిర్వహిస్తున్నYCP అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై చంద్రగిరి ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన దిగారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగంచకుండా కేవలం వైసీపీ అభిమానుల ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. రవిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.