W.G: సంక్రాంతి పండుగ వేళ నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో జూద క్రీడలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. మూడు రోజుల పండుగ ముసుగులో నిర్వహించిన జూదాలపై 170 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జి. శ్రీవేద ఇవాళ వెల్లడించారు. ఈ దాడుల్లో 386 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2,68,770 నగదు అలాగే 366 డైస్, 57 గుండాట బోర్డులు, 115 కోడిపుంజులు చేసుకున్నారు.