MHBD: డోర్నకల్ పట్టణ కేంద్రంలో శనివారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కాలా సుమేర్ జైన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రనాయక్ సహాయ సహకారాలతో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదల పాలిట వరంగా ఇట్టి చెక్కులు పనిచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.