SRPT: పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం నిండింది. అర్వపల్లి వద్ద కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు హెడ్మాస్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణకు వెళ్తూ.. అనంతలోకాలకు వెళ్లిన తోటి టీచర్ను తలచుకుని సహచర ఉపాధ్యాయులు కన్నీరుమున్నీరవుతున్నారు.