BHNG: తుర్కపల్లి మండలం ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుల్లెల మంజూష రాణిని మండల విద్యాశాఖ అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా పూర్తి అదనపు బాధ్యతలను శుక్రవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో స్వీకరించారు. ఈ సందర్భంగా పలు యూనియన్ మండల బాధ్యులు పాల్గొని నూతన ఎంఈవోను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.