ADB: జిల్లాకు చెందిన ఉట్నూరు అదనపు ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ శనివారం బదిలీ అయ్యారు. గత సంవత్సరం జనవరి 1 తేదీన ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూర్ ఏఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన ఆమె సెప్టెంబర్ 19న అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. సాధారణ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీ 2గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.