SKLM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులుతో కలిసి రణస్థలం మండలం కోటపాలెం పంచాయతీలో గల ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ భద్ర మహంకాళి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.