MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించే సీఎం ట్రోఫీ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి గల క్రీడాకారులు, యువత పేర్లను నమోదు చేయించుకోవాలని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడా పోటీలు జనవరి 22 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు, కార్యదర్శుల వద్ద పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు.