HYD: నగరంలో గోషామహల్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి ప్రాజెక్టు పరిధిలో అడ్డంకిగా ఉన్న 56 నిర్మాణాలను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తిగా తొలగించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ చర్యతో ఆసుపత్రి నిర్మాణ పనులకు ఆటంకాలు తొలిగి వేగంగా పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది.