WNP: మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రూ.299 చెల్లిస్తే సమ్మక్క-సారలమ్మ బంగారం ప్రసాదాన్ని ఇంటి వద్దకే అందించనున్నట్లు శనివారం వనపర్తి డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. భక్తులు వెబ్సైట్ ద్వారా, టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.