మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.226కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.