SRD: సంగారెడ్డి కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై నేడు రాజకీయ పార్టీలతో సమావేశం జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీల అధ్యక్షులకు అధికారులు సమాచారం అందించారు. పార్టీ ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు శనివారం వెల్లడించారు.