MBNR: పట్టణంలోని తిరుమలదేవునిగుట్ట దగ్గర స్వయంభూవుగా వెలసిన అతి పురాతనమైన శ్రీ తిరుమలనాతస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రూ.19 లక్షల ముడా నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న మల్టీపర్పస్ షెడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాబోవు రోజులలో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వెల్లడించారు.