WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరగనున్న ఎన్నికలకు ముందుగా వార్డుల వారీగా రిజర్వేషన్ జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందులో ఎస్టీ జనరల్-1, ఎస్టీ మహిళ-1, ఎస్సీ జనరల్-5, ఎస్సీ మహిళ-4, బీసీ జనరల్-10, బీసీ మహిళ-9, మహిళా జనరల్-15 వార్డులు కేటాయించారు. మొత్తం 13 వార్డులను అన్రిజర్వ్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.