SRCL: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పీఠానికి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సిరిసిల్ల మున్సిపాలిటీ-జనరల్ మహిళ, వేములవాడ మున్సిపాలిటీ-బీసీ జనరల్ కేటాయించారు. గతంలో ఈ రెండు మున్సిపాలిటీలలో బీసీ మహిళలు ఛైర్పర్సన్స్గా కొనసాగగా, తాజా రిజర్వేషన్లతో సమీకరణాలు మారాయి. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా కేటగిరీల అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.