SDPT: గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లోని మోడల్ స్కూల్లో ప్రవేశాలు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. వన్నెసా తెలిపారు. 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు, 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని, అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.