KMR: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.