MLG: రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు శ్రద్ధగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మంత్రి సీతక్క హెలీప్యాడ్, టెంట్ సిటీ, సంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం, క్యూ లైన్, మీడియా టవర్ నిర్మాణాలు, ఆర్చ్, ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. సిబ్బంది సమన్వయం సాధిస్తూ అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి పర్యటన సాఫీగా జరగేలా ఆదేశించారు.