మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ భారీ విజయం అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా 25 లక్షల టికెట్స్ అమ్ముడైన ఈ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు.