NZB: పట్టణంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీమ్స్ పని విధానం, ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మరక్షణ గురించి వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డయల్ 100, టీసేఫ్ యాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే విధానం, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.