కృష్ణా: మోపిదేవి శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని జస్టిస్ ఎన్.జయసూర్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం దేవస్థానానికి వచ్చిన జస్టిస్ ఎన్.జయసూర్య కుటుంబానికి సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు స్వాగతం పలికారు. స్వామివారి నాగపుట్టలో పాలు పోసి, గర్భాలయంలో పూజలు జరిపించుకోగా వారికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో సత్కరించారు.
Tags :