కామారెడ్డి జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం 5 రోజుల పాటు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మొదటి బ్యాచ్ శిక్షణ జనవరి 19 నుంచి 23 వరకు, రెండో బ్యాచ్ ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతాయి. పంచాయతీ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ఉద్దేశమని పేర్కొన్నారు.